ఖానాపూర్ టౌన్, జనవరి30: ఖానాపూర్(Khanapur) తహసీల్దారుగా సుజాత రెడ్డి( Tehsildar Sujatha Reddy) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన మామిడి శివరాజ్ నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. కడెం తహసీల్దారుగా పనిచేసిన సుజాత రెడ్డి బదిలీపై ఇక్కడకు వచ్చారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న మామిడి శివరాజ్.. సుజాత రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది నూతన తహసిల్దార్‌కు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. జిల్లాలో నలుగురు తాసిల్దారులను బదిలీ చేస్తూ నిర్మల్ జిల్లా కలెక్టర్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..