Raksha bandhan | నార్నూర్, ఆగస్టు : సోదర సోదరీమణుల మధ్య ప్రేమ ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలంలో ఆనందోత్సవాల మధ్య వైభవంగా జరుపుకున్నారు. ప్రతీ ఇంట్లో అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి సోదరులపై ఉన్న ప్రేమానురాగాలను, ఆప్యాయతను చాటారు. యువతులు, మహిళల సందడితో ఇండ్లలో పండగ వాతావరణం నెలకొంది.
ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్‌కు నార్నూర్ మండలంలోని వేంపూర్ నివాసంలో అక్కాచెల్లెళ్లు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కాచెల్లెళ్లు అన్నదమ్ములకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపే వేడుక రాఖీపౌర్ణమి అన్నారు.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో