Ration Shops | నర్సాపూర్ జి, జూన్ 12 : వర్షాకాలం నేపథ్యంలో ప్రభుత్వం ఒకేసారి 3 నెలల రేషన్‌ను ఇవ్వాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపుల వద్ద బారులు తీరుతున్నారు. నర్సాపూర్ జి మండలంలోని రాంపూర్ గ్రామంలో రేషన్ కోసం లైన్ కట్టారు.
గంటల తరబడి వేచి చూస్తున్నారు. ఒక్కరికి 15 నుంచి 20 నిమిషాల సమయం పడుతుంది. ఒక్కరికి మూడు సార్లు వేలి ముద్రలు వేయాల్సి వస్తుంది. ఒక్కసారి వేలి ముద్ర వేస్తే ఒక్కసారి తూకం చేయాలి.. ఇలా ఒక్కొక్కరికి మూడు సార్లు వేలి ముద్రలు వేసి మూడు సార్లు తూకం వేయాల్సి వస్తుంది కాబట్టి ఆలస్యం అవుతుంది అని రేషన్ డీలర్లు తెలుపుతున్నారు.
రాత్రి వేళలో కూడా రేషన్ కోసం క్యూ కడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. ఉదయం పూట తోటల్లోకి వెళ్లి రాత్రి పూట లైన్లో వేచి చూస్తున్నారు. ఇది ఇలా ఉండగా సర్వర్ కూడా సరిగా రాకపోవడంతో ఆలస్యం అవుతుంది.. దీంతో రేషన్ బియ్యానికి వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్