Pak Unemployment | పాకిస్థాన్‌లో 21 ఏళ్ల గరిష్ఠస్థాయికి నిరుద్యోగిత.. ‘ఆర్థిక స్థిరత్వం’ ఉత్త డొల్ల
Pak Unemployment | పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Govt) తాము దేశంలో ఆర్థిక స్థిరత్వం (Financial Stability) సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలు పూర్తిగా అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం (Unemployment ) తీవ్రస్థాయికి చేరింది.
Pak Unemployment : పాకిస్థాన్ ప్రభుత్వం (Pakistan Govt) తాము దేశంలో ఆర్థిక స్థిరత్వం (Financial Stability) సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలు పూర్తిగా అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం (Unemployment ) తీవ్రస్థాయికి చేరింది. లక్షలాది మంది పాకిస్థానీలకు ప్రభుత్వం చెబుతున్న ‘ఆర్థిక స్థిరత్వం’ అనేది ఉపాధినివ్వని ఓ పనికిరాని మాటగానే మిగిలిపోయింది. ఈ విషయాన్ని పాకిస్థానీ మీడియా కథనం ఒకటి స్పష్టంచేసింది.
ది న్యూస్ ఇంటర్నేషనల్ పత్రిక కథనం ప్రకారం.. 2025 లేబర్ ఫోర్స్ సర్వే భయంకరమైన వాస్తవాలను బయటపెట్టింది. దేశంలో నిరుద్యోగిత రేటు 7.1 శాతానికి పెరిగింది. ఇది గడిచిన 21 ఏళ్లలో అత్యధికం. ఈ గణాంకాలు ప్రభుత్వ విజయవాదానికి కళ్లెం వేస్తున్నప్పటికీ, అధికారిక ప్రకటనల్లో దీని ప్రస్తావనే లేకుండా పోయింది. ఉద్యోగాలు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు, నిత్యావసరాలు తగ్గించుకుంటున్న కుటుంబాలు, అవకాశాల్లేక ఆశలు కోల్పోతున్న యువత రూపంలో ఈ సంక్షోభం ప్రతిరోజూ కనిపిస్తూనే ఉన్నది.
ఈ మీడియా కథనం నేపథ్యంలో.. ‘పాకిస్థాన్ రాబోయే పదేళ్లలో ఏకంగా 3 కోట్ల ఉద్యోగాలను సృష్టించాల్సి ఉంటుంది’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా చేసిన హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ఏటా దాదాపు 30 లక్షల మంది యువత ఉద్యోగ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న తరుణంలో వారికి ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది. ఈ సంక్షోభానికి నిదర్శనంగా 2025లో రికార్డు స్థాయిలో దాదాపు 4,000 మంది డాక్టర్లు దేశం విడిచి వెళ్లిపోయారు.
వృత్తిపరమైన గౌరవం, ఆర్థిక భద్రత లేకపోవడమే ఇందుకు కారణం. ఉద్యోగాల కల్పన కోసం ప్రైవేటు రంగంపై ఆధారపడటం కూడా సమస్యను జఠిలం చేస్తోంది. ఫ్యాక్టరీలు మూతపడుతుండటం, తయారీదారులు విదేశాలకు తరలిపోతుండటంతో ఆ రంగం కూడా తీవ్ర ఒత్తిడిలో ఉంది. కేవలం లెక్కల్లో స్థిరత్వం చూపిస్తూ, క్షేత్రస్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం దెబ్బతింటే ఆ స్థిరత్వం వల్ల ప్రయోజనం ఏమిటని సదరు కథనం ప్రశ్నించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

