కోదాడ, ఫిబ్రవరి 10 : కోదాడ పట్టణంలోని సీసీఆర్ విద్యా నిలయం పంపిణీ కేంద్రం నుండి ఎన్నికల అధికారులు మంగళవారం పోలింగ్ సామగ్రిని ఆయా కేంద్రాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ సూర్యనారాయణ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం 491 మంది సిబ్బంది పీఓ, ఏపీఓ, ఓపీఓ విధుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన బూత్‌లకు చేరుకున్నట్లు చెప్పారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సుమారు 200 మంది పోలీసులతో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం : ఆర్డీఓ సూర్యనారాయణ

మున్సిపల్ పోలింగ్‌కు సర్వం సిద్ధం : ఆర్డీఓ సూర్యనారాయణ