నిర్మల్ టౌన్, జనవరి 27 : దేశంలోనే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ నేతలు చూడలేకపోతున్నారని, చౌకబారు ఆరోపణలు చేస్తే ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త ప్రతిఘటించేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ముథోల్ ఎమ్మె ల్యే విఠల్‌రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సందర్భంగా సంబురాలు చేసుకున్నారు. మొదటగా నిర్మల్‌కు వచ్చిన విఠల్‌రెడ్డి.. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్, ఐకేరెడ్డి, విఠల్‌రెడ్డికి మద్దతుగా టీఆర్ఎస్ నా యకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దేశంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ప్రజలకు ఏ ఒక్క మంచి పనైనా చేసిందా? అని సూటిగా ప్రశ్నించారు. దేశంలో రైతులు, ప్రజలను అన్ని విధాలా మోసం చేసిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపా ఠం చెబుతారన్నారు. అనంతరం విఠల్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు.
కేసీఆర్ పాలనలోనే కార్యకర్తలకు గౌరవం..
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించిన తర్వాతే కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకూ గౌరవం దక్కుతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా పార్టీ బాధ్యతలు అప్పగించడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి కార్యకర్తలు ఆగం కావద్దని సూచించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సాజిద్ అహ్మద్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు సాగర్బాయి రాజన్న, ఎం పీపీలు రామేశ్వర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, అడెల్లి ఆలయ చైర్మన్ చందు, నాయకులు రమణారావు, గోవర్ధన్‌రెడ్డి, మహేందర్, మోహినొద్దీన్, నజీర్‌ఖాన్, వెంకటేశ్, చంద్రశేఖర్‌రెడ్డి, నర్సారెడ్డి, జగదీశ్వర్, సోని ఉన్నారు.
లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి
దళితబంధు, డబుల్బెడ్రూం ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ము థోల్, బోథ్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, సోయం బాపురావ్‌తో కలిసి వివిధ పథకాలపై సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దళితబంధు ద్వారా ఒ క్కొక్క నియోజకవర్గానికి వంద యూనిట్లను మంజూ రు చేశారని తెలిపారు. వచ్చే నెల 5 లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి, మార్చి 15 లోపు నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. జిల్లాలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినందున లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. 3,400 ఇండ్లు నిర్మించామని, నిర్మల్ పట్టణంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. అనంతరం జిల్లాలో ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, నేషనల్ హైవే మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినందున రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సమన్వయంతో పను లు వేగంగా ముందుకు తీసుకెళ్లాలన్నారు. అదనపు కలెక్టర్ రాంబాబు, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జిల్లా అధికారులు జయంత్‌రావు చౌహాన్, విజయలక్ష్మి, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి, హన్మండ్లు, మధుసూదన్ పాల్గొన్నారు.