Manne krishank | ముఖ్యమంత్రికి ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచన వచ్చినట్టుంది. వుమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించి రేవంత్ రెడ్డి చివరికి రాష్ట్రంలో మొబైల్ ఫోన్లలో కూడా స్కాం చేశాడని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. కేంద్రప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీంలో అంగన్వాడీ అక్కలకు అందరికీ కూడా స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నది. దాని కోసం ధర పెంచుతూ వచ్చిన్ను.
చివరికి స్మృతి ఇరానీ 2024లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు రూ.9 వేల నుంచి రూ.11,800కు బడ్జెట్‌ను నిర్ణయించారు. ఒక్కొక్క మొబైల్ ఫోన్ అంగన్ వాడీ వర్కర్ల కోసం.. రూ.11,800 ఒక్క డివైస్ కోసమని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. వాళ్లు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకున్న డేటా.. ఈ టెక్నాలజీని పెంచేందుకు పోషణ్ అభియాన్‌లో స్మ్టార్ట్ ఫోన్ స్కీం ఇస్తున్నరు.
ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద, చిన్నవేల కోట్లు, భూములు, హెచ్ఐఎల్టీ, మూసీ లక్షా 50 వేల కోట్లు , గాంధీ విగ్రహం రూ.5 వేల కోట్లు కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా పైసలొస్తే సింపుల్‌గా ఓ రూ.20 కోట్లు జేబులో వేసుకోవాలే అని ప్లాన్ చేసిన్రని ఆరోపించారు. ఎంత దారణమంటే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల్లో పనిచేసే అక్కలంతా రోడ్లపైకి వచ్చి మాకు జీతాలివ్వాలె.. మాకు జీతాలెస్తలేరని ప్రభుత్వాన్ని అడుగుతుంటే.. కేంద్రప్రభుత్వం వారికి స్మార్ట్ఫోన్లకు ఇస్తున్న పైసలు కూడా మింగింది స్కాంగ్రేస్ ప్రభుత్వమన్నారు.
ఇక్కడ రూ.10 కోట్లు స్కాం..
శాంసంగ్ A06 మొబైల్ 4GB RAM, 64GB స్టోరేజ్ బయట రూ.8,249 అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.11,650 అంటూ స్కాం చేసింది. మంత్రి సీతక్క శాఖలోని అంగన్వాడీ అక్కలకు 38,130 స్మార్ట్ ఫోన్ల కోసం రూ.54 కోట్లకు టెండర్ ఇచ్చారు. మేము ప్రశ్నించగానే రూ.44 కోట్లు మాత్రమే ఫోన్లకు ఖర్చు అయింది. మిగతా రూ.10 కోట్లు ఫోన్ల మెయింటైనెన్స్ కోసం అని అంటున్నారు. ఫోన్ల మెయింటెనెన్స్ ఖర్చు ఏంటో అర్ధం కావడం లేదు.. ఇక్కడ రూ.10 కోట్లు స్కాం చేశారని మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.54 కోట్లు తీసుకొని రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. అవుట్ డేటెడ్ మొబైల్ ఫోన్లు ఇచ్చి అంగన్వాడీ మహిళల దగ్గర కూడా స్కాం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు ఉందా అసలు అని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి చివరికి మొబైల్ ఫోన్లలో కూడా రూ.50 కోట్ల స్కాం చేశాడు
కేంద్ర ప్రభుత్వం పోషణ్ అభియాన్ స్కీంలో అంగన్వాడీ అక్కలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు
ఈ స్మార్ట్ ఫోన్లలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ స్కాం చేసింది – బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ https://t.co/RH5dqdB585 pic.twitter.com/K0T8TsOL2L
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2026
కేంద్ర ప్రభుత్వం దగ్గర రూ.54 కోట్లు తీసుకొని రూ.24 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు
అవుట్ డేటెడ్ మొబైల్ ఫోన్లు ఇచ్చి అంగన్వాడీ మహిళల దగ్గర కూడా స్కాం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గు ఉందా అసలు – బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ https://t.co/yoaP4WQ1bY pic.twitter.com/ms0BKMNP9Q
— Telugu Scribe (@TeluguScribe) March 19, 2026
PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!