ఉద్యోగులకు ఖుషీ కబురు
ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలతో పాటు ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టింది.
- అంతర జిల్లా పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా
- ఈనెల 15 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
- జీవో నెం. 21 విడుదలతో ఉద్యోగుల్లో హర్షం
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 3 : ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2018లో కొత్త జోన్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం ఇటీవల 317 జీవోతో పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యోగుల కేటాయిం పు చేపట్టింది. 52శాఖలతో పాటు ఉపాధ్యాయుల బదిలీలను పారదర్శకంగా చేపట్టింది. ప్రభుత్వం ఆయా జిల్లాలో సీనియారిటీ ప్రతిపాదికన ఉద్యో గుల బదిలీలు చేపట్టింది. భార్యభర్తలు వేర్వేరు చోట్ల ఉద్యోగం చేయాల్సి రావడంతో వెసులు బాటు కల్పించి స్పౌజ్ కింద బదిలీలకు అనుమ తినివ్వగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమా రు 150 మంది దంపతులకు ప్రయోజనం చేకూరింది.
317 జీవోతో పరస్పర బదిలీలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా జీవో నెం. 21ను విడుదల చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో వివిధ శాఖల్లో సుమారు 25వేల ఉద్యోగులు పని చేస్తుండగా.. అదనంగా మరో 9,356 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అయితే ఇటీవల బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లిన వారు ఈ ప్రాం తంలో ఉద్యోగం చేస్తున్న వారితో పరస్పర అంగీ కారంతో ఆన్లైన్లో ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకుంటే వారికి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల బాసర జోన్లో ఉండ గా.. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపా లపల్లి, ములుగు కాళేశ్వరం జోన్లో ఉన్నాయి.
మల్టీజోన్‌లో 33 జిల్లాల పరిధిలో పరస్పర బదిలీలకు అవకాశం ఉండడంతో ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు పరస్ప ర బదిలీ కోరుకున్నప్పుడు సమాన కేడర్ నిబం ధన వర్తించనున్నాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు, తదితర ప్రాం తాల్లో పని చేసే ఉద్యోగులకు ఈ ప్రాంతంలో పని చేసే ఉద్యోగులుంటే పరస్పర బదిలీల కింద బదిలీ అయ్యే అవకాశం ఉండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 50-100కు పైగా ఉద్యోగులు ఉంటారని అధికారులు పేర్కొంటున్నారు. ఉద్యోగుల పరస్పర బదిలీలకు పచ్చజెండా ఊపడంతో ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం హామీని నిలబెట్టుకుంది..
మానసిక ఆవేదనకు గురవుతున్న ఉద్యోగు లకు బదిలీల్లో వెసులుబాటు కల్పిస్తామని ఇచ్చి న హామీ నిలబెట్టుకున్నది. నెల రోజుల క్రితమే భార్యభర్తలిద్దరూ ఒకేచోట పని చేసేం దుకు స్పౌజ్ కేకెటగిరి ఉద్యోగులను బదిలీ చేయడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 150కి పైగా ఉద్యోగులకు ప్రయోజనం దక్కింది. ఉద్యోగుల పరస్పర బదిలీలకు ప్రభుత్వం జీవో నెం. 21ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతిగా మరోసారి నిరూపించుకుంది.
– మోహన్‌రెడ్డి, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు
చాలా ఆనందం అనిపించింది..
నాది నిర్మల్ పట్టణం. 20 ఏళ్ల నుంచి నిర్మల్‌లో ఉంటున్నా. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న నేను జీవో 317 ప్రకారం ఇటీవల ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లాను. ప్రతిరోజూ ఆదిలాబాద్ వెళ్లడం వల్ల ఇబ్బంది ఎదుర్కొం టున్నా. నిర్మల్‌లో పని చేసిన ఆదిలాబాద్‌కు చెందిన మా తోటి ఉపాధ్యాయుడు తన స్వస్థలానికి వెళ్లేందుకు పరస్పర అంగీకార బదిలీకి సిద్ధ్దంగా ఉన్నాం. ప్రభుత్వం జీవో జారీ చేయడం వల్ల మాకు న్యాయం జరుగనుంది.
– కృష్ణమూర్తి, సోషల్ స్టడీస్, నిర్మల్
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

