సమష్టి కృషితోనే జిల్లా ప్రగతి పథం
ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కష్టపడి పని చేయడం వల్లే నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 3 : ఉద్యోగులు, అధికారులు సమష్టిగా కష్టపడి పని చేయడం వల్లే నిర్మల్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుంచామని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ముషారఫ్ అలీ ఫారూ ఖీ పదవీ కాలం రెండేళ్లు పూర్తి అయిన సంద ర్భంగా గురువారం సంబురాలు జరుపుకున్నా రు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు కలెక్టర్‌కు పుష్పగు చ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్డీవో రమేశ్ రాథోడ్, డీపీవో వెంకటేశ్వర్లు, జిల్లా అధికా రులు రమేశ్‌కుమార్, శంకరయ్య, శ్రీనివాస్‌గౌడ్, మల్లికార్జున్, దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు శివప్ర సాద్, జాకీర్‌హుస్సేన్, తదితరులున్నారు.
మంత్రి అల్లోల శుభాకాంక్షలు
కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రెండేళ్ల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. మంత్రిని కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాను మరింత అభివృద్ధి పర్చాలని మంత్రి సూచించారు.
మాదకద్రవ్యాల నిర్మూలన మన బాధ్యత
సోన్, ఫిబ్రవరి 3 : మాదకద్రవ్యాల నిర్మూలన సామాజిక బాధ్యతగా గుర్తించి సహకరించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పేర్కొన్నా రు. సోన్ మండలం కడ్తాల్ వై జంక్షన్ వద్ద గల సాగర్ కన్వెన్షన్ హాలులో జిల్లా పోలీసుల ఆధ్వ ర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యువత గంజాయి వినియోగం, రవాణా చేయ డం, సాగు చేయడం వల్ల కలిగే అనర్థాలను ప్రజల కు అవగాహన కల్పించాలని సూచించారు. పోలీ సులు, ఎక్సైజ్‌శాఖ సమన్వయంతో పనిచేసి మాద క ద్రవ్యాల నిర్మూలనపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
సమాచారమిస్తే నగదు పురస్కారం..
నిర్మల్ జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, మత్తు పదార్థాల విక్రయంపై ఎవరూ సమాచారం ఇచ్చిన వారికి నగదు పురస్కారం అందిస్తామని జిల్లా ఎస్పీ ప్రవీణ్‌కుమార్ పేర్కొ న్నారు. గ్రామాల్లో మత్తుపదార్థాలు ఉన్నట్లు గుర్తిస్తే వారు వెంటనే 8333986939కు వాట్సా ప్ ద్వారా సమాచారం అందించాలన్నారు. అనం తరం అధికారులతో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వ హించారు. అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, భైంసా ఏఎస్పీ కిరణ్కార్గె, డీఎస్పీలు ఉపేందర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సోన్ రాంనర్సింహారెడ్డి, ఎస్ఐలు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

