ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని సుర్జాపూర్, కడెం, బెల్లాల్ 33/11 సబ్ స్టేషన్ పరిధిలోకి వచ్చే గ్రామాలకు మెరుగైన విద్యుత్ (Power Supply) అందించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది నిరంతరం కృషి చేస్తుందని ఖానాపూర్ సబ్స్టేషన్ ఏఈ రాంసింగ్ అన్నారు. శనివారం సబ్ స్టేషన్ పరిధిలోని రహదారికి ఇరువైపులా 33/11 కేవీ వైర్లను ఆనుకొని ఉన్న చెట్ల కొమ్మలను సిబ్బందిచే తొలగించారు. దీంతో ఖానాపూర్ కడెం మండలాలకు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. వానాకాలం దృష్ట్యా ఇబ్బందులు తలెత్తకుండా మరమ్మత్తులు చేపట్టినట్లు ఏఈ తెలిపారు.