Kubeer PHC | కుభీర్, నవంబర్ 09 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది నామమాత్రపు విధులు నిర్వహిస్తుండడంతో మండల ప్రజలకు ఆరోగ్య సేవలు అందడం లేదన్నది నిజం. శనివారం వచ్చిందంటే 11 గంటల నుండి సిబ్బంది ఎవరికి వారు వారి స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమవుతారు. 12 గంటలకు ఆసుపత్రిని మూసేసి వెళ్లిపోవడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం 10 తర్వాతే సిబ్బంది ఆసుపత్రికి చేరుకుంటారు రెండు గంటలు పానం మీద విధులు నిర్వహించి వెళ్లిపోతారు.
ఇక ఆదివారం ఎవ్వరూ రారు. డాక్టర్తోపాటు స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఇతర సిబ్బంది ఎవరు విధులకు రారు. శనివారం, ఆదివారం నమస్తే తెలంగాణ PHCని సందర్శించగా 12 గంటలలోపే శనివారం ఆస్పత్రికి తాళం వేసి వెళ్లిపోయారు. ఆదివారం మాత్రం స్థానికుడైన ఫార్మాసిస్ట్ ఆనంద్ ఒక్కరే డ్యూటీలో ఉన్నారు. మిగతా సిబ్బంది ఎవ్వరూ కూడా రాలేదు. మండలంలో43 జీపీలు సుమారు 75 గ్రామాలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో ఈ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేవి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన 2 ఏళ్లకాలంగా ఒక్కరి కంటే ఒక్కరికి పురుడు పోసిన దాఖలాలు లేవు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూతన పీహెచ్సీ భవనం..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపాయలు 90 లక్షల వ్యయంతో నూతన పీహెచ్సీ భవనాన్ని నిర్మించారు. అంబులెన్స్ సౌకర్యం లేదు. డాక్టర్తో సహా సిబ్బంది ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు తెలియని పరిస్థితి. ప్రతి రోజు మధ్యాహ్నం 12 దాటితే ఆసుపత్రికి తాళం ఉంటుంది. ఇంత జరుగుతున్నా జిల్లాలోని ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ చొరవ చూపకపోవడంతో పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా తయారైంది. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సిబ్బంది సాయంత్రం వరకు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కుబీర్తోపాటు మండల ప్రజలు కోరుతున్నారు.

Anandhi | నేను ఓరుగల్లు పిల్లని.. పుట్టింది, పెరిగింది అంతా వరంగల్లోనే!
Earthquake | అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం
Tornado | టోర్నడో బీభత్సం.. ఆరుగురు మృతి.. 800 మందికి గాయాలు