కుభీర్, సెప్టెంబర్ 09 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కళాశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అధ్యాపకులు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధ ప్రజాకవి మాత్రమే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడని అన్నారు.
ఉద్యమకారుడిగా, రాజకీయ కార్యకర్తగా, గొప్ప కవిగా కాళన్నగా పేరు గడించారని కొని యాడారు. తెలంగాణ తొలి దశ ఉద్యమాలకు ప్రతిధ్వనిగా నిలిచిన మహనీయుడు కాళోజీ అని కీర్తించారు. కాళోజీ నారాయణ భాషా సాహిత్యానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమం లో ఇంచార్జి ప్రిన్సిపాల్ విజయ్ భాస్కర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్ రావు, అధ్యాపకులు కే.సంపత్, హన్మంతరావు, శివరాజ్, శేఖర్, నర్సయ్య, నరేష్, ఉమాదేవి, రమ్య, మాధవి, విద్యార్థులు పాల్గొన్నారు.