ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలోని పత్తి కొనుగోళ్లలో సీసీఐ నిబంధనలో విధిస్తూ రైతుల నుంచి పత్తి కొనుగోలు చేయడానికి నిరాకరిస్తుందంటూ నేరడిగోండలో రైతులు ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్- నాగపూర్ జాతీయ రహదారి 44 బైఠాయించి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..తేమతో సంబంధం లేకుండా సీసీఐ మద్దతు ధరతో పత్తిని కొనుగోలు చేయాలన్నారు. ఎకరాకు ఏడు క్వింటాళ్ల పరిమితిని ఎత్తివేసి 12 కుంటల వరకు కొనుగోలు చేయాలని రైతులకు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొనుగోళ్లు చేపట్టకుంటే ఆందోళనలు చేపడుతామన్నారు.