మహబూబ్‌నగర్ కలెక్టరేట్, మార్చి 14 : దేశంలో బీసీలు 80కోట్ల జనాభా ఉన్నా.. ఇప్పటి వరకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖ లేదంటే ఎందుకు.? అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.. ఆలోచించాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. నూతనంగా ఎన్నికైన బీసీ స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జేజేఆర్ గార్డెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా బహుజన క్లాస్ టీచర్స్ అసోసియేషన్ (బీసీటీఏ) ఆధ్వర్యంలో మ హాత్మా జ్యోతిబాఫూలే ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించగా మాజీ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడారు. కర్ణాటక, కేరళ, ఇతర రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో మాత్రం లేరన్నారు.
మనలోన చైతన్యం లేనంత వరకు పూర్తిస్థాయిలో అభివృద్ధి సాధించలేమని.. మనోడు మనకే శత్రువులుగా మారుతున్నారన్నారు. ఐక్యత లేకుండా కమిట్మెంట్ లేకుండా వేరోళ్లను అనడం తప్పు అని హితవు పలికారు. బీసీలంతా ఐక్యంగా ఉంటే ప్రతి ఒక్కడు పిలిచి రాజకీయాల్లో మనకు కావాల్సిన టికెట్ ఇస్తారని అన్నారు. తెలంగాణ రాదని చెప్పినా.. కోట్లాడి సాధించుకున్నాం.. రానే రాదన్నప్పుడు ఎవరు ఉద్యమాన్ని నడిపారనేది కళాకారులకు, ఉపాధ్యాయులకు, ఉద్యమకారులకు తెలుసన్నారు. నూతనంగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారు గతంలో ఎట్లా ఉన్నారో అట్లే ఉండాలి.. అవే బట్టలు, అవే బండి.. అదే ఇళ్లు.. అ ట్లానే ఉండాలని, లేదంటే మనల్ని బద్నాం చేసే బ్యా చ్‌లు ఉంటాయి జాగ్రత్త పడాలన్నారు. ఇది నేను అనుభవ పూర్వకంగా చెబుతున్నా.. గుర్తుపెట్టుకోవాలని కోరారు.
తెలంగాణ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డా బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు ఉద్యమించాలి. జనాభా దామాషా ప్రకారం మేమెంతో మాకంత అంటూ తిరగబడాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎంప్లాయిస్ ఉద్యమానికే నాయకత్వం వహించాడు.. ప్రతి నిమిషం విశేష కృ షి చేశారని కొనియాడారు. రాష్ట్రంలో పుట్టిన బిడ్డ జై తెలంగాణ అనుకుంటూ పుట్టింది.. ఇకపై జై బీసీ అనుకుంటూ పుట్టాలని.. అలా ఉద్యమాన్ని నడపాలన్నారు. కనీసం ఇప్పుడు మనం కోట్లాడితే మన భ విష్యత్తు తరం బాగుపడుతుందన్నారు. ప్రతి కుటుంబానికి రూ.20లక్షలు బీసీ బంధు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని కళాశాల వసతి గృహాలకు శాశ్వత భవనాలు నిర్మించాలన్నారు. కా ర్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్, బీజేపీ నాయకులు శాంతికుమార్, బీఆర్ఎస్ నాయకులు కేఎస్.రవికుమార్, కోరమోని వెంకటయ్య, గంజివెంకన్న, శివరాజ్, మున్నూరు రాజు, బీసీ నాయకులు కృష్ణుడు, లక్ష్మణ్‌గౌడ్, రాఘవేందర్, ధనుంజయ, మల్లేశ్, పాలమూరు యూనివర్సిటీ బోధనేతర ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్జీ పాల్గొన్నారు.