ఎదులాపురం, మార్చి 14 : ఆదిలాబాద్ జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు పారదర్శకంగా, ప్రశాం త వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డులో ఉన్న సరస్వతీ శిశు మందిర్, వినాయక్ చౌక్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల-2 కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో ఆరా తీస్తూ.. హాజరు శాతంపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తహసీల్దార్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు ; ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. కేంద్రాలను ఎస్పీ స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, గిరిజన బాలిక ల ఆశ్రమ ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగు తున్నట్లు పరీక్ష కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమల్లో ఉన్నట్లు తెలిపారు.
గిమ్మా కేంద్రాన్ని తనిఖీ చేసిన డీఈవో
ఆదిలాబాద్ జిల్లాలో జరుగు తున్న పదో తరగతి పరీక్షలను ప్రశాంతంగా నిర్వ హించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్ అన్నారు. శనివారం ఉమ్మడి మండలంలోని గిమ్మా పదో తరగతి కేంద్రాన్ని తనిఖీ చేశారు. డీఈవో వెం ట గిమ్మా పదో తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూప రింటెండెంట్ మద్ది లస్మన్న, ఫ్లయింగ్ స్కాడ్ ఉద య్రావు, డీవో భూమన్న అన్నారు. అదేవిధంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి కేంద్రాన్ని జిల్లా ఫ్లయింగ్ స్కాడ్ ఉదయ్‌రావు, జైనథ్ మండల తహసీల్దార్ ఆత్రం నారాయణ కేంద్రాన్ని సందర్శించి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిమ్మా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ మద్ది లస్మన్న, జైనథ్ సీఎస్ గుణవంత్, డీవోలు భూమన్న, రవికుమార్ పాల్గొన్నారు.
నిర్మల్‌లో ప్రశాంతం
నిర్మల్ అర్బన్, మార్చి 14 : నిర్మల్ జిల్లా కేంద్రంలో పదో తరగతి పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రా రంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 9747 మంది విద్యార్థులు 47 కేంద్రాల్లో పరీక్షలు రాశారు. 9741 మంది విద్యార్థులు హాజరుకాగా ఆరుగురు గైర్హాజ రయ్యారు. కేంద్రాలను కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవార్‌పేట్ కాలనీలోని బాలికల ఉన్నత పాఠశా లను తనిఖీ చేశారు. పరీక్ష జరుగుతున్న సరళిని పరిశీలించారు. అనంతరం స్థానిక మేధా మాడల్ స్కూల్‌ను ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. వీరి వెంట ఏఎస్పీ సాయికిరణ్ ఉన్నారు.