కుభీర్ : మండలకేంద్రం కుభీర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేయాలని సోమవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కోరారు. జనాభాతో పాటు విస్తీర్ణంలో జిల్లాలోనే పెద్దదైన కుభీర్ మండలంలో ఇక్కడ గిరిజనులు, ఎస్సీలు, బలహీన వర్గాల వారు పేదలు అధికంగా ఉన్నారని దీనిపై దృష్టి సారించాలని సూచించారు. అసెంబ్లీ వ్యవహారాల ఇన్చార్జి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమాధానమిస్తూ ఈ అంశాన్ని పరిశీలించి అక్కడ ముప్పై పడకల ప్రభుత్వ సీహెచ్‌సీ ఏర్పాటును పరిశీలిస్తామని తెలిపారు.
మంత్రి సానుకూలంగా స్పందించడంపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీపీ తూం లక్ష్మి, జడ్పీటీసీ అల్కాతాయి హాన్, సర్పంచ్ మీరా విజయ్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు అనిల్, శంకర్ హాన్, తూం రాజేశ్వర్, సింగిల్ విండో చైర్మన్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.