నిర్మల్ : కాంగ్రెస్ పాలనలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం మండలం మొహాల గ్రామానికి చెందిన దండే గంగన్న (53) అనే రైతు మంగళవారం ఉదయం ఇంటి ముందు గల చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
తనకున్న వ్యవసాయ భూమిలో పత్తి పంట వేయగా ఆశించిన దిగుబడి రాకపోవడం, పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు పేరుకుపోవడంతో మనస్థాపానికి గురైన గంగన్న ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. గంగన్న మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.