KCR | ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ రైతులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేస్తూ పాలాభిషేకం చేశారు. రెండేళ్లకుపైగా కాంగ్రెస్ పాలనలో రైతు భరోసా లేక, రుణమాఫీ కాక, కరెంట్ సరిగ్గా రాక తమ బతుకులు ఆగమయ్యాయని.. మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు నిజమైన పండగ అని అంటున్నారు.
ముక్రా (కే) రైతులు నాగలి పట్టి మళ్లీ పల్లె పల్లెన సంక్షేమ పథకాలు అందాలంటే ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి..’ ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి..’ అంటూ ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ పేరుతో రైతులను మోసం చేసిందని.. కేసీఆర్ పాలనలో టింగ్ టింగ్ అంటూ రైతులకు రైతు బంధు వచ్చేదని.. కాంగ్రెస్ పాలనలో మాత్రం పథకాలు కాగితాలకే పరిమితమయ్యారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, దత్త, వెంకటి, సంతోష్, మారుతి, రావ్ సాబ్, మహిళలు పాల్గొన్నారు.

PM Modi | తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, గవర్నర్
Ustaad Bhagat Singh | ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ రివ్యూ.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ఎలా ఉంది.!