Jagadish Reddy | నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్.. రేవంత్ రెడ్డి కామెంట్స్‌పై జగదీష్ రెడ్డి కౌంటర్
Jagadish Reddy | ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ అటాక్ చేశారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మందిని బలి తీసుకున్నాడన్నారు.
Jagadish Reddy | ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ కామెంట్స్‌పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు కాదు క్రిమినల్ వేస్ట్ నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. చదువుకున్నోడికి తెలుస్తది.. చదువు విలువ. చదువు రాని వాళ్లకు కూడా తెలుస్తదన్నారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మేం చదువుకోలేకపోయినం.. మా పిల్లలన్నా చదువుకోవాలని చెప్పి తల్లిదండ్రులు తాపత్రయపడుతుంటరు. ఎందుకంటే చదువుతోనే వెలుగు.. చదువుతోనే ప్రపంచాన్ని చూడగలుగుతాం. కాబట్టి చదువు విషయంలో కేసీఆర్ స్పష్టంగా ఓ మాట చెప్పారు. ఒక తరానికి మనం నాణ్యమైన విద్యనందించి ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడగలుగుతున్నామనే విశ్వాసాన్ని ఇచ్చి పంపిస్తే ఇక ఆ సమాజానికి తిరుగులేని సమాజం అన్నారు. దాని కోసమే కేసీఆర్ ప్రత్యేకించి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలతోపాటు మైనార్టీలను కూడా విద్య పట్ల ఆసక్తిని పెంచి 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టారు.
తెలంగాణలో ఇవాళ ఏ జెన్ జీ స్టూడెంట్ను పలకరించండి. ఇవాళ అద్భుతంగా హైదరాబాద్‌లో మాట్లాడుతున్న పిల్లలే కాదు.. నువ్వు నల్లగొండ పోతవా.. ? కరీంనగర్, ఆదిలాబాద్ పోతవా..? ఎక్కడైనా ఆ పిల్లలను మాట్లాడించు. ఢిల్లీ పిల్లలకో, అమెరికా పిల్లలకో ఏ మాత్రం తగ్గకుండా మాట్లాడుతరు.. చాలెంజ్ చేస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మందిని బలి తీసుకున్నాడు. రేవంత్ రెడ్డి లాగా కేసీఆర్ మాటలు చెప్పలేదు.. పని చేసి చూపించారని అన్నారు.
విద్యార్థులు కాదు క్రిమినల్ వేస్ట్ నువ్వే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్
రేవంత్ రెడ్డి లాంటి మూర్ఖుడిని విద్యాశాఖ మంత్రిగా ఉంచినందుకు 250 మందిని బలి తీసుకున్నాడు
ఒక తరానికి నాణ్యమైన విద్యని అందించి ప్రపంచంలో ఎవరితో అయినా పోటీపడగలం అనే విశ్వాసాన్ని ఇస్తే అదే తిరుగులేని సమాజం… https://t.co/encJn5c45H pic.twitter.com/tWcFKiGqt2
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ క్రిమినల్ వేస్ట్
వారికి కనీసం జాబ్ అప్లికేషన్ నింపడం కూడా రాదు
సంవత్సరానికి లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు
– సీఎం రేవంత్ రెడ్డి pic.twitter.com/GOTxohpomi
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
Read Also :
Municipal Commissioner | భద్రకాళి బండ్‌పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

