Japan | జపాన్ సరికొత్త రికార్డు.. లక్ష దాటిన శతాధిక వృద్ధుల సంఖ్య..!
Japan | జపాన్ (Japan) సరికొత్త రికార్డు దక్కించుకుంది. ఆ దేశంలో శతాధిక వృద్ధుల సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. అక్కడ ప్రస్తుతం 1,07,677 మంది శతాధికులు ఉన్నట్లు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Japan Health Ministry) సెప్టెంబర్ 15న అధికారికంగా ప్రకటించింది. వందేళ్లు పైబడిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తున్నది.
Japan : జపాన్ (Japan) సరికొత్త రికార్డు దక్కించుకుంది. ఆ దేశంలో శతాధిక వృద్ధుల సంఖ్య లక్ష మార్కును అధిగమించింది. అక్కడ ప్రస్తుతం 1,07,677 మంది శతాధికులు ఉన్నట్లు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Japan Health Ministry) సెప్టెంబర్ 15న అధికారికంగా ప్రకటించింది. వందేళ్లు పైబడిన వారి సంఖ్య ఏటా పెరుగుతూ వస్తున్నది. ఇలా క్రమం తప్పకుండా శతాధికుల సంఖ్య పెరగడం అనేది గత 56 ఏండ్లుగా వరుసగా కొనసాగుతున్నది.
ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. శతాధికుల్లో మహిళలదే అగ్రస్థానం. మొత్తం సంఖ్యలో సుమారు 88 శాతం, అంటే 94,298 మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం దేశంలో అత్యంత వృద్ధురాలిగా క్యోటోకు చెందిన 114 ఏళ్ల ఫుయో కిషిమోటో, అత్యంత వృద్ధుడిగా కుమామోటోకు చెందిన 112 ఏళ్ల హికారు కాటో రికార్డుల్లో నిలిచారు. జపాన్లో శతాధికుల సంఖ్య వృద్ధిని పరిశీలిస్తే.. 1963లో గణాంకాల సేకరణ ప్రారంభమైనప్పుడు వీరి సంఖ్య కేవలం 153 మాత్రమే ఉండేది.
ఆ సంఖ్య 1981 నాటికి వెయ్యి దాటింది. 1998లో 10,000 కు, 2012లో 50,000 కు చేరింది. ఇప్పుడు ఏకంగా లక్ష మార్కును దాటి సరికొత్త రికార్డును నమోదుచేసింది. ఈ గణాంకాలపై జపాన్ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో యునో హర్షం వ్యక్తంచేశారు. వైద్య, సాంకేతిక రంగాల్లో సాధించిన అద్భుత ప్రగతి వల్లే ప్రజలు ఆరోగ్యకరమైన, క్రియాశీలక దీర్ఘాయుష్షును పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు. జపాన్లో ఏటా నిర్వహించే ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్’ అనే ప్రభుత్వ సెలవుదినానికి ముందు ఈ వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వందేళ్లు పూర్తి చేసుకున్న వారిని ప్రభుత్వం గౌరవించడం ఆనవాయతీగా వస్తున్నది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

