Summit | హైదరాబాద్: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో 25వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమావేశం నేడు ప్రారంభమయ్యింది. 18వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇది ఇంధన సామర్థ్యంపై నిర్వహించే భారతదేశ అతిపెద్ద సదస్సు. సీఐఐ సోహ్రాబ్జీ గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (CII-GBC) నేతృత్వంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ‘యాక్సెలరేటింగ్ ది ట్రాన్సిషన్ టు ఎ నెట్ జీరో ఎకానమీ త్రూ ఎనర్జీ ఎఫిషియన్సీ, క్లీన్ టెక్నాలజీస్, సస్టెయినబుల్ ప్రాక్టీసెస్’ థీమ్‌తో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
మొదటి రోజు సమావేశంలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామికవేత్తలు సుమారు 3500 మంది హాజరవుతున్నారు. ఈ సమావేశంలో ఇంధన నిర్వహణలో ప్రతిభ కనబరిచిన కంపెనీలకు జాతీయ అవార్డులు అందజేస్తారు.