బూర్గంపహాడ్, సెప్టెంబర్ 16 : బూర్గంపహాడ్ మండలంలో పలు కుటుంబాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు బుధవారం పరామర్శించారు. మండల పరిధిలోని మోరంపల్లిబంజర్లో బీఆర్ఎస్ నాయకుడు బత్తుల రామకొండారెడ్డి తండ్రి బత్తుల చిన్నపరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయం తెలుసుకున్న రేగా కాంతారావు ఆయన నివాసానికి వెళ్లి చిన్నప్పరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి రామకొండారెడ్డి, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం, సానుభూతి తెలిపారు. అదే గ్రామానికి చెందిన పుట్టి రాంబాబు మృతిచెందగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, నాయకులు మేడిగం లక్ష్మినారాయణరెడ్డి, గోపిరెడ్డి రమణారెడ్డి, కైపు ఖగేందర్రెడ్డి, యక్కంటి శ్రీనివాసరెడ్డి, గోనెల నాని, సోము లక్ష్మిచైతన్యరెడ్డి, కృష్ణ, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, ఆయా అనుబంధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.