Ponguleti Srinivas Reddy | ఈ నెల 12న శాసనసభలో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ మేరకు హరీశ్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు పిటిషన్లు సమర్పించారు.
శాసనసభలో 22ఏ నిషేధిత భూములపై చర్చ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేక సత్యదూరమైన విషయాలను ప్రస్తావిస్తూ నిరాధారమైన ఆరోపణలుచేయడమే కాకుండా నా ప్రతిష్టకు భంగం కలిగించారని, పవిత్రమైన శాసనసభను తప్పుదోవ పట్టించారని హరీశ్ రావు నోటీసుల్లో పేర్కొన్నారు.
సెప్టెంబర్ 12న శాసనసభలో 22ఏ అంశంపై జరిగిన చర్చ సందర్భంగా ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకొని నేను కొన్ని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకున్నానని నాపై తప్పుడు ఆరోపణలు చేసి, నా ప్రతిష్టకు, అసెంబ్లీ పరువు ప్రతిష్టలకు పొంగులేటి భంగం కలిగించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ నెల 12న శాసనసభలో తమపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు పిటిషన్లు సమర్పించిన హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి pic.twitter.com/wxo2LTBS6d
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్‌లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల