Folk Artists Eshwar Sai | ఫోక్ ఆర్టిస్ట్‌ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్య శరణ్య సూసైడ్ అటెంప్ట్!
Folk Artists Eshwar Sai | తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది.
Folk Artists Eshwar Sai | తెలుగు రాష్ట్రాల్లో గత కొంతకాలంగా సంచలనం సృష్టిస్తున్న జానపద కళాకారులు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదం ఊహించని మలుపు తిరిగింది. పెళ్లి పేరుతో తనను మోసం చేశారంటూ సింగర్ మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించడం, దీనికి సంబంధించిన పరిణామాలు సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ వివాదం తారస్థాయికి చేరిన వేళ, ఈశ్వర్ సాయి భార్య శరణ్య తీవ్ర నిర్ణయం తీసుకోవడం కలకలం రేపింది.
ఈ వివాదం నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన శరణ్య తాజాగా ఒక ఆడియో మెసేజ్‌ను విడుదల చేశారు. “నేను ఈ పోరాటంలో పూర్తిగా మోసపోయాను.. ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను.. నా జీవితాన్ని పూర్తిగా ఆగమాగం చేశారు, అందుకే నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది. ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. దయచేసి నా కొడుకుని అందరూ కలిసి జాగ్రత్తగా చూసుకోండి” అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసిన వాయిస్ మెసేజ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ పరిణామాల మధ్య తీవ్ర మనోవేదనతో శరణ్య బలవన్మరణానికి యత్నించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నారని, ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. జానపద కళాకారుల వ్యక్తిగత వివాదాలు కాస్తా ఒక నిండు ప్రాణం మీదికి రావడంతో అటు ఇండస్ట్రీలోనూ, ఇటు శ్రోతల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఉదంతానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసే అవకాశం ఉంది.
నేను ఈ పోరాటంలో మోసపోయాను
ఈశ్వర్ లేకపోతే నేను బతకలేను
బలవన్మరణానికి ప్రయత్నించిన ఈశ్వర్ సాయి భార్య శరణ్య
నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి
నా జీవితాన్ని ఆగమాగం చేశారు.. నాకు ఇదొక్కటే మార్గం కనిపిస్తోంది
ఈ ద్రోహాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆడియో విడుదల… https://t.co/LYMjCGNmQL pic.twitter.com/AGersQ48SG
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Self Declaration | రైతులకే డిక్లరేషన్ ఎందుకు.. ప్రజావాణిలో నిలదీసిన అన్నదాత
Balmoor Venkat | పొలం దారి ఆక్రమించిన బల్మూరి.. చంపేస్తమని బెదిరింపులు.. కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసిన వృద్ధుడు
LTCG Tax | స్టాక్ మార్కెట్ మదుపర్లకు ఊరట.. ఎల్టీసీజీ పన్ను తగ్గింపుపై కేంద్రం కీలక కసరత్తు!
Hyderabad Land Encroachment | కుర్మల్‌గూడలో కబ్జా పర్వం.. రూ.200 కోట్ల భూమి హాంఫట్
Hyderabad Ganja Case | గంజాయి బామ్మ నెట్వర్క్ పెద్దదే.. ఫోన్ కాల్ లిస్ట్‌తో బయటపడ్డ అసలు వ్యవహారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

