ECB | కలిసొచ్చిన ఐపీఎల్ అనుభవం.. ఇంగ్లండ్ కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్..!
ECB : ఐపీఎల్లో 18 ఏళ్లు కోచ్‌గా సేవలందిచిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) మళ్లీ బిజీ కానున్నాడు. కోచ్‌గా సుదీర్ఘ అనుభవమున్న ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా నియమితులయ్యాడు.
ECB : ఐపీఎల్లో 18 ఏళ్లు కోచ్‌గా సేవలందిచిన స్టీఫెన్ ఫ్లెమింగ్ (Stephen Fleming) మళ్లీ బిజీ కానున్నాడు. కోచ్‌గా సుదీర్ఘ అనుభవమున్న ఫ్లెమింగ్ ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా నియమితులయ్యాడు. బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon McCullum) రాజీనామాతో ఏర్పడిన ఖాళీ.. న్యూజిలాండ్‌కే చెందిన ఫ్లెమింగ్‌తో భర్తీ చేసింది ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB). ఊహించనట్టుగానే బెన్ స్టోక్స్ అనంతరం టెస్టు సారథిగా జో రూట్ (Joe Root)కు పగ్గాలు అప్పగించింది ఈసీబీ.
ఫ్రాంచైజీ క్రికెట్లో కోచ్‌గా అదరగొట్టిన స్టీఫెన్ ఫ్లెమింగ్ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి వచ్చాడు. ఈసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఫ్లెమింగ్ కోచింగ్ ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్‌ను తదుపరి టెస్టు కోచ్‌గా నియమిస్తూ మంగళవారం ఈసీబీ ప్రకటన విడుదల చేసింది. జస్టిన్ లాంగర్, రవి శాస్త్రి, అలెస్టర్ కుక్, రాహుల్ ద్రవిడ్.. వంటి దిగ్గజాల పేర్లు వినిపించినా చివరకు ఫ్లెమింగ్‌కే ఈసీబీ జై కొట్టింది. పాకిస్థాన్‌తో సిరీస్ అనంతరం ఫ్లెమింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. అప్పటివరకూ మార్కస్ ట్రెస్కోథిక్ తాత్కాలిక కోచ్‌గా కొనసాగనున్నాడు.
Exclusive: Former New Zealand captain’s first matches in charge likely to be in South Africa at Christmas
🔗 https://t.co/hDcTNZ3rDn pic.twitter.com/j6Uk9M99ZL
— Telegraph Cricket (@TeleCricket) July 29, 2026
‘క్రికెట్లో స్టీఫెన్ ఫ్లేమింగ్ ఎంతో గౌరవప్రదమైన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంగ్లండ్ పురుషుల టెస్టు జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు సిద్ధపడినందుకు మేము అదృష్టవంతులం. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిభావంతులతో నిండిన ఇంగ్లండ్‌ను ఫ్లెమింగ్ గొప్పగా తీర్చిదిద్దుతాడని, విజయాల బాట పట్టిస్తాడని నేను నమ్ముతున్నా. అలానే ఆయన నేతృత్వంలో ఇంగ్లండ్ నిలకడగా రాణిస్తుందని ఆశిస్తున్నా’ అని ఇంగ్లండ్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ వెల్లడించాడు.
Stephen Fleming wants to give something back to English cricket 🤝
🔗 https://t.co/XGk7U09F89 pic.twitter.com/CGQMG7F9kV
— Cricinfo (@cricinfo) July 30, 2026
చెన్నైతో 18 ఏళ్లు
కోచింగ్ దిగ్గజంగా పేరొందిన ఫ్లెమింగ్ 18 ఏళ్లు చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) కోచ్‌గా సేవలందించాడు. 20వ సీజన్‌కు ముందు ఫ్రాంచైజీకి బైబై చెప్పేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో ఆటగాడిగా ఫ్లెమింగ్ జట్టులో చేరాడు. ఆ తర్వాత 2009 నుంచి కోచింగ్ బృందంలో చేశాడు.

చెన్నై జట్టుపై 2016, 2017లో నిషేధం కారణంగా.. అతడు పూణె జట్టుకు కోచ్‌గా సేవలందించాడు. 2017లో పూణె జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఫ్లెమింగ్ హయాంలో చెన్నై జట్టు 11 సార్లు ఫైనల్స్ ఆడింది. 10 సార్లు ఐపీఎల్లో, ఓ సారి చాంపియన్స్ లీగ్‌లో ఫైనల్స్‌కు వెళ్లింది. మొత్తంగా ఆరు సార్లు జట్టు టైటిల్ గెలిచింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voter Deletion | టార్గెట్ బీఆర్ఎస్?.. తొలగించిన ప్రతి రెండు ఓట్లలో ఒకటి బీఆర్ఎస్ నియోజకవర్గానిదే
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

