మంచిర్యాల : జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ రాజేశ్వరి(55) అనే మహిళ మృతి చెందిన సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దండేపల్లి మండలం కన్నెపెళ్లి గ్రామానికి చెందిన ముత్తెం రాజేశ్వరి అనే మహిళ అస్వస్థతకు గురికావడంతో గురువారం రాత్రి మంచిర్యాల పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌కు చికిత్స కోసం తీసుకోవచ్చారు. పరీక్షించిన అక్కడి వైదులు గుండె సమస్య ఉందని స్టంట్స్ వేసినట్లు తెలిపారు.
ఆపరేషన్ సైతం విజయవంతమైనట్లు వైద్యులు తెలిపారని మృతురాలు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం చికిత్స పొందుతూ వివాహిత మృతి చెందింది. వైద్యుల ఆపరేషన్ విఫలం అవడంతోనే ఆమె మృతి చెందిందని బందువుల ఆరోపణ చేస్తూ మృత దేహంతో దవాఖాన ఎదుట ఆందోళన చేపట్టారు. హాస్పిటల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.