Urea Distribution | తాండూర్, సెప్టెంబర్ 16 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని కొత్తపల్లి రైతు వేదిక వద్ద మంగళవారం చేపట్టిన యూరియా బస్తాల పంపిణీ కార్యక్రమం భారీ బందోబస్తు నడుమ కొనసాగింది. కొత్తపల్లి రైతు వేదిక వద్దకు వెళ్లేందుకు యూరియా లోడు లారీలు, ఆటోలకు వెళ్లలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో రహదారి పక్కనే ఈ యూరియా బస్తాల పంపిణీ కొనసాగింది.
మండలానికి కేవలం 500 బస్తాలు మాత్రమే రావడంతో అధికారులు రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా ఒక్క పాస్బుక్కు ఒక బస్తా చొప్పున పంపిణీ చేశారు. కానీ రైతులు మాత్రం 1500పైనే తరలివచ్చి పడిగాపులు కాశారు. ఈ చేతగాని అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ బాహాటంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సిన రైతాంగం ఒక్క బస్తా యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. పండు ముసలోళ్లు, వృద్ధులు, యువకులు, మహిళలు యూరియా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న తీరు ప్రతి ఒక్కరిని బాధించింది.
మాదారం త్రీ ఇంక్లైన్కు చెందిన గాంధారి పోశవ్వ ఆమె కొడుకు, కోడలు కూడా ఉదయం 7 గంటలకే వచ్చి లైన్లో వేచి ఉన్నారు. లైను ఎంతకూ కదలకపోవడం మరోవైపు ఆకలి బాధతో వృద్ధురాలు బాధపడుతుండటంతో కుమారుడు లైన్లో నుంచి బయటకు వచ్చి హోటలు నుంచి అల్పాహారం తీసుకు వచ్చివ్వడంతో ఆదర బాదరాగా ఆ అవ్వ అక్కడే ఆకలి బాధ తీర్చుకోవడం గమనార్హం. అయినా వారికి యూరియా దొరకలేదు..!
అలాగే కొందరు వృద్దులు యూరియా తీసుకునేందుకు వచ్చి లైన్లో ఇబ్బందులు పడుతుండగా అధికారులు, ఎస్ఐలు, పోలీసులు వారికి సహకరించారు. రైతులు పెద్ద ఎత్తున రావడంతో ఎటువంటి సంఘటనలు జరగకుండా తాండూర్, మాదారం ఎస్ఐలు కిరణ్ కుమార్, సౌజన్య ఏఎస్ఐలు భారీగా పోలీసులతో బందోబస్తు నిర్వహించారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్హౌస్’ ఓఎస్టీ విడుదల