మంచిర్యాల : జిల్లాలోని కాసిపేట గని వద్ద మంగళవారం టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయాలని బీజేపీ చూస్తుందని, సింగరేణిని మనమే కాపాడుకోవాలని వారు పిలుపునిచ్చారు.
ఇందుకోసం ఒక రోజు దీక్షలో భాగంగా బెల్లంపల్లి కాంట చౌరస్తా వద్ద 9న దీక్ష చేయనున్నట్లు, అందులో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య పాల్గొంటున్నట్లు తెలిపారు.
కార్మికులందరూ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గని ఫిట్ సెక్రటరీ దుగుట శ్రీనివాస్, ఏరియా నాయకులు మేడ సమ్మయ్య, వోడ్నాల రాజన్న, సొల్లంగి శ్రీనివాస్, తిరుపతి అసిస్టెంట్ ఫిట్ సెక్రటరి బైరి శంకర్, మైకేల్ రమేశ్, ఫిట్ కమిటీ, సేఫ్టీ కమిటీ సభ్యులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొన్నారు.