తాండూర్, ఏప్రిల్ 13: కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, సింగరేణిలో టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి హక్కులను సింగరేణి కార్మికులకు అందజేయడం జరిగిందని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు అన్నారు. టీబీజీకేఎస్ హాయాంలో సాధించిన హక్కులను తెలుపుతూ కరపత్రాలను ముద్రించి బెల్లంపల్లి ఏరియా తాండూర్ మండలంలోని ఏరియా స్టోర్, వర్క్ షాప్ లలో సోమవారం కార్మికులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా సింగరేణిలో గెలిచిన ఏఐటీయూసీ గాని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గాని ఒక్క హక్కు సాధించకపోగా కేసీఆర్, టీబీజీకేఎస్ సాధించిన తండ్రి కొడుకుల ఉద్యోగాలను నిలిపివేయడం జరిగిందని, మెడికల్ బోర్డును గత సంవత్సరం నుంచి నిర్వహించడం లేదన్నారు.
250 గజాల ఇంటి స్థలం ఇస్తానన్న మాట మర్చిపోయారని మేనిఫెస్టోలో పేర్కొన్న 45 హామీలను ఇచ్చి మర్చిపోయారని వెంటనే హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధరావత్ మంగీలాల్, ఏరియా నాయకులు రమేష్, వెంకటేష్, పిట్ కార్యదర్శి గణపతి, ఏరియా వర్క్ షాప్ పిట్ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.