కాసిపేట, డిసెంబర్ 3 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు ఆర్థరాత్రి వరకు సాగాయి. చివరి రోజు అభ్యర్థులు నామినేషన్ల కేంద్రాలకు పోటెత్తెడంతో అర్ధరాత్రి వరకు అభ్యర్థులు క్యూలైన్లలో ఉండి నామినేషన్లు వేశారు. కాసిపేట మండలంలోని 22 గ్రామ పంచాయతీల్లో మంగళవారం ఒక్క రోజే సర్పంచ్‌కు 78, వార్డులకు 318 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తంగా నామినేషన్లు ముగిసే వరకు 22 సర్పంచ్ స్థానాలకు 113 మంది, 190 వార్డులకు 393 మంది నామినేషన్లు వేశారు.
కాసిపేటలో 6 సర్పంచ్, 23 వార్డలకు, మామిడిగూడలో 7 సర్పంచ్, 10 వార్డులకు, సోమగూడెం(కే)లో 4 సర్పంచ్, వార్డులకు 17, లంబాడితండా(కే)లో 6 సర్పంచ్, 20 వార్డులకు, ముత్యంపల్లిలో 3 సర్పంచ్, 24 వార్డులకు, చిన్న ధర్మారంలో 4 సర్పంచ్, 9 వార్డులకు, పెద్దనపల్లిలో 3, 20 వార్డులకు, కోమటిచేసులో 9 సర్పంచ్, 20 వార్డులకు, పల్లంగూడలో 4 సర్పంచ్, వార్డులకు 16, బుగ్గగూడ(కే)లో 2 సర్పంచ్, 12 వార్డులకు, కోనూర్‌లో 6 సర్పంచ్, 17 వార్డులకు, కొండాపూర్‌లో 9 సర్పంచ్, వార్డులకు 16, తాటిగూడలో 5 సర్పంచ్, 15 వార్డులకు, ధర్మారావుపేటలో సర్పంచ్ 1, 11 వార్డులకు, లంబాడితండా (డీ)లో 7 సర్పంచ్, 17 వార్డులకు, మల్కెపల్లిలో 4 సర్పంచ్, 20 వార్డులకు, రొట్టెపల్లిలో 2 సర్పంచ్, 11 వార్డులకు, సోనాపూర్‌లో 3 సర్పంచ్, 13 వార్డులకు, వెంకటాపూర్‌లో 2 సర్పంచ్, 9 వార్డులకు, గట్రామ్పల్లిలో 2 సర్పంచ్, 15 వార్డులకు, దేవాపూర్‌లో 15 సర్పంచ్, 59 వార్డులకు, మద్దిమాడ సర్పంచ్ 9, వార్డులకు 19 నామినేషన్లు వేశారు.