మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామానికి చెందిన రాదండి రాజేష్ శివరాత్రి రోజున గోదావరి నది స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నదిలో పడి మరణించగా అతని కుటుంబానికి ఆ గ్రామ హమాలీలు(Hamalis) అండగా నిలిచారు. గ్రామంలోని కాల భైరవ హమాలీ సంఘం ఆధ్వర్యంలో 50 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను భైరవ హమాలీ సంఘం అధ్యక్షులు తాళపెల్లి బాపు, ఉపాధ్యక్షులు మారపాక రాజేష్ ల ఆధ్వర్యంలో హమాలీ సంఘ సభ్యులు అందజేశారు.
ఆపద సమయంలో నిరుపేద కుటుంబానికి తమ వంతు సహాయం అందజేసిన హమాలి సంఘాన్ని గ్రామస్తులు అభినందించారు. రానున్న రోజుల్లో గ్రామంలో మరిన్ని సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి..
Jyothika | దక్షిణాదిలో నటిగా కొనసాగడం కష్టం.. సిద్ధాంతాలకు కట్టుబడితే ఒంటరిపోరు చేయాల్సిందే: జ్యోతిక
Bolivia Accident | బొలీవియాలో రెండు బస్సులు ఢీ.. 37 మంది మృతి