literacy | మంచిర్యాల జిల్లాలోని ఏజన్సీ ప్రాంతమైన కాసిపేట మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమం సకైస్ అయ్యింది. శనివారం ఒక్క రోజే కాసిపేట మండలంలో 3462 మంది నిరక్షరాస్యులకు పరీక్ష నిర్వహించి, మూల్యంకనం చేయగా నిరక్షరాస్యులైన వారంతా అక్షరాస్యులుగా మారారు.
కాసిపేట మండలంలోని గ్రామ పంచాయతీల వారీగా అక్షరాస్యత కేంద్రాలను ఏర్పాటు చేసిన వంద రోజుల్లో వంద శాతం అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టడంతోపాటు కుట్టు శిక్షణ శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి బడుల్లో చదువు నేర్చుకున్న వయోజనులకు శనివారం ఒకేసారి ముత్యంపల్లి, ధర్మారావుపేట రైతు వేదికలతోపాటు గ్రామ పంచాయతీలవారీగా ఒకేసారి పరీక్షలకు ఏర్పాటు చేశారు.
మొత్తానికే చదువు రాని వారికి చదువు నేర్పించి..
వయస్సుతో తేడా లేకుండా వృద్ధుల నుంచి వయోజనులు అంతా ఉత్సాహంగా పరీక్షకు హాజరై తమ ప్రతిభ చూపారు. మొత్తానికే చదువు రాని వారికి చదువు నేర్పించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దారు. ఈ మేరకు ముందుగా అధికారులు ప్రశ్నా పత్రాలను విడుదల చేసి వయోజనులకు పరీక్ష నిర్వహించారు. చదువుతోనే జ్ఞానం పెరుగుతుందని, దీని ద్వారా ఏదైనా సాధించే అవకాశాలు ఉంటాయని అధికారులు అవగాహన కల్పించారు. దూర గ్రామాల వయోజనులకు ప్రత్యేక వాహనాలు కూడా ఏర్పాటు చేసి కేంద్రాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ చాతరాజుల దుర్గా ప్రసాద్, తహసీల్దార్ భోజన్న, ఆత్మ చైర్మన్ రౌత్ సత్తయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ తిరుపతి, విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తి, ఏపీఎం వెంకటేశ్వర్లు, ఏవో చల్ల ప్రభాకర్, ఎంపీవో శేఖ్ సఫ్టర్ అలీ, డీఆర్సీ బండ శాంకరి, కొండ జనార్ధన్, అశోక్ రావు, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీ నారాయణ, జూనియర్ అసిస్టెంట్ తిరుపతి, ప్రధాన కార్యదర్శి మైదం రమేశ్, ఎస్సీ సెల్ అధ్యక్షులు గోలేటి స్వామి, మేరుగు శ్రీనివాస్, ఇంగు నారాయణ, ఆయా పంచాయతీల కార్యదర్శులు, పలు శాఖల అధికారులు, వయోజన విద్యా వాలంటీర్లు, వయోజనులు భారీగా పాల్గొన్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం