Financial Help | కాసిపేట, డిసెంబర్ 10 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం (కే) గ్రామానికి చెందిన అక్షర ఇంగ్లీష్ మీడియం ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ శివ కుమార్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందగా వారి కుటుంబానికి మంచిర్యాల జిల్లా ప్రైవేటు పాఠశాలల సంఘం ట్రస్మా ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం వారి ఇంటికి వెళ్లి శివ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి ట్రస్మా జిల్లా నాయకులు సేకరించిన రూ.1,75,000 ఆర్ధిక సహాయాన్ని అందించారు.
రూ.1,50,000 ఆయన కుమార్తె పేరు మీద ఎల్ఐసీ ఫిక్స్ డ్ బాండ్, రూ.25,000 నగదును అందించారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు దామెర్ల సిద్దయ్య మాట్లాడుతూ.. అక్షర స్కూల్ కరస్పాండెంట్ శివకుమార్ ఆకస్మిక మరణం జిల్లాలో విద్యావేత్తల వర్గాలను తీవ్ర విషాదంలోకి నెట్టేసిందన్నారు. వారి పిల్లల విద్య విషయంలో వారు ఎక్కడ చదువుకున్నా, జిల్లా ట్రస్మా పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. పిల్లలకి భవిష్యత్ లో ఎలాంటి కష్టమొచ్చిన ట్రస్మా అండగా నిలబడతుందని, ఆ కుటుంబానికి పూర్తి భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా శివకుమార్ సతిమణి భావోద్వేగానికి లోనై ట్రస్మా నాయకులందరికీ తమ హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనుగు శ్రీకాంత్ రెడ్డి, జిల్లా కోశాధికారి ఉదారి చంద్ర మోహన్ గౌడ్, రాష్ట్ర నాయకులు రాపోలు విష్ణు వర్ధన్ రావు, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు కొమ్ము దుర్గా ప్రసాద్, మందమర్రి మండల అధ్యక్షులు పెద్దపల్లి ఉప్పలయ్య, కాసిపేట మండల అధ్యక్షులు ఎస్. చంద్ర శేఖర్, నాయకులు ఉస్మాన్ పాషా, వై కరుణాకర్ రెడ్డి, లడ్డూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Fire accident | టెక్స్టైల్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం.. దగ్ధమైన 20కి పైగా దుకాణాలు
Ramavaram : ప్రతి ఒక్కరు శాంతియుతంగా ప్రచారం కొనసాగించాలి : కొత్తగూడెం టూ టౌన్ సీఐ ప్రతాప్
Akhanda 2 | అఖండ 2 దెబ్బకి ఇన్ని సినిమాలు వాయిదా పడ్డాయా.. ఏకంగా రజనీకాంత్ చిత్రం కూడా..!