మంచిర్యాల అర్బన్, సెప్టెంబర్ 23: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు (Premsagar Rao) సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆయన పీఏ శ్రీధర్ వెల్లడించారు. ఆయన ఆరోగ్యంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారని పేర్కొన్నారు. పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ట్రాఫిక్ వ్యవస్థపై ఫోన్లో పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారన్నారు. ఎమ్మెల్యే ఆరోగ్యంపై కొంతమంది పనిగట్టుకొని వివిధ రకాల ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు పరిస్థితి విషమం అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న విషయం తెలిసిందే.