కరీంనగర్ కలెక్టర్‌గా చిత్రా మిశ్రా
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్రా మిశ్రా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న పమేలా సత్పతి కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్‌గా ఉన్న గరిమా అగ్రవాల్‌కు పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి ఐఏఎస్‌ల బదిలీలు జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు.
- పమేలా సత్పతి కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ
- రాజన్నసిరిసిల్ల కలెక్టర్‌గా గరిమా అగ్రవాల్‌కు పూర్తి బాధ్యతలు
కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 26 : కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్‌గా ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ పీవోగా ఉన్న చిత్రా మిశ్రా నియమితులయ్యారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న పమేలా సత్పతి కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా బదిలీ అయ్యారు. రాజన్న సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్‌గా ఉన్న గరిమా అగ్రవాల్‌కు పూర్తిస్థాయి కలెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చారు. బుధవారం అర్ధరాత్రి ఐఏఎస్‌ల బదిలీలు జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు విడుదల చేశారు. 2015 బ్యాచ్‌కు చెందిన పమేలా సత్పతి 2023 అక్టోబర్ 31 నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఇటీవల పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కూ డా పూర్తిచేశారు. తాజాగా కార్మికశాఖ ప్రత్యేక కమిషనర్‌గా వెళ్తున్నారు. ఆమె స్థానంలో 2019 బ్యాచ్‌కు చెందిన చిత్రా మిశ్రా వస్తున్నారు. 2020-21లో నాగర్‌కర్నూల్‌లో ట్రైనీ కలెక్టర్‌గా, 2021 జూన్ నుంచి 2024 ఫిబ్రవరి వరకు నిజామాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా, 2024 ఫిబ్రవరి నుంచి ఐటీడీఏ పీవోగా కొనసాగుతున్నారు. 2021 సెప్టెంబర్ నుంచి 2023 జూలై వరకు నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్‌గా అదనపు ఇన్చార్జి బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ప్రస్తుత కలెక్టర్ పమేలా సత్పతి శుక్రవారం రిలీవ్ అయ్యే అవకాశాలుండగా, చిత్రా మిశ్రా విధుల్లో చేరుతారని అధికారులు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన గరిమా అగ్రవాల్
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) : 2019 బ్యాచ్‌కు చెందిన గరిమా అగ్రవాల్ గత అక్టోబర్ 23న రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా బాధ్యతలు స్వీకరించారు. ఆమె జాయిన్ అయిన కొద్ది రోజులకే కలెక్టర్ హరిత సెలవులో వెళ్లడంతో అప్పటి నుంచి ఇన్చార్జి కలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె పూర్తి స్థాయి కలెక్టర్‌గా నియమితులయ్యారు. దాంతో గరిమా అగ్రవాల్ గురువారం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నూతన కలెక్టర్‌కు అర్చకులు ఆశీర్వచనం అందించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, పలువురు జిల్లా అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏవో రామ్‌రెడ్డి, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రావణ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

