హైదరాబాద్, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రేషన్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 15వ తేదీన 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు సంబంధించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డిలో ప్రారంభించనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,06, 28,092 ఆహార భద్రతాకార్డుల ద్వారా 3.43 కోట్ల మంది లబ్ధిదారులు ఆహార భద్రత పరిధిలో ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.