మాస్కో: రష్యాలో టీయూ-95 స్ట్రాటజిక్ బాంబర్(Bomber crashes) కూలింది. తూర్పు దిశగా ఉన్న అముర్ ప్రాంతంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రమాదంలో ఆరు మంది సిబ్బంది మృతిచెందినట్లు రక్షణ శాఖ పేర్కొన్నది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. జన సాంద్రత లేని ప్రాంతంలో బాంబర్ కూలినట్లు రక్షణ శాఖ తెలిపింది. బాంబర్ కూలిన ప్రాంతానికి రష్యన్ ఏరోస్పేస్ ఫోర్సెస్ కమిషన్ సభ్యులు వెళ్లారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. 1952లో సొవియేట్ డిజైన్ చేసిన టీయూ-95 బాంబర్ విమానం ఎగిరింది. కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైళ్లను వాడేందుకు రష్యా ఇదే బాంబర్‌ను వినియోగిస్తున్నది. ఆ క్షిపణులతో ఉక్రెయిన్‌పై అటాక్ చేస్తున్నది. థర్మోన్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను కూడా ఆ బాంబర్ మోసుకెళ్లగలదు.