9 నెలలైనా స్పందించరా?
మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావుతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా ఇచ్చిన స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది.
- కేకే పిల్లల స్థలాల క్రమబద్ధీకరణపైమీ వైఖరి చెప్పడానికి జాప్యమెందుకు?
- 3 వారాల్లోగా అఫిడవిట్ వేయండి
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
- ఇదే చివరి అవకాశమని స్పష్టీకరణ
హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావుతోపాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మికి అనుకూలంగా ఇచ్చిన స్థలాల క్రమబద్ధీకరణ ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటికే 9 నెలలు గడిచినప్పటికీ ప్రభుత్వం మరో 4 వారాల గడువు కోరడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రమబద్ధీకరణపై అధికారులతో చర్చించి ప్రభుత్వం నిర్ణయాన్ని తెలియజేయాలని, అవసరమైతే గత డిసెంబర్లో ఇచ్చిన క్రమబద్ధీకరణ ఉత్తర్వులను సవరించాలన్న కోర్టు ఆదేశాలపై ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరిస్తూ 3 వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.
కేకే కొడుకు, కూతురి స్థలాలను క్రమబద్ధీకరిస్తూ జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన జీ రఘువీర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం మంగళవారం మ రోసారి విచారణ చేపట్టింది. బంజారాహిల్స్ స్లమ్ ఏరియాలో వెంకటేశ్వరరావుకు చెందిన 1,161 చదరపు గజాల స్థలాన్ని ప్రభుత్వం 1998 నాటి మారెట్ విలువ ప్రకారం చదరపు గజానికి రూ.2,500 చొప్పున క్రమబద్ధీకరించిందని పిటిషనర్ పేర్కొన్నారు. కవితారావు తరఫున విజయలక్ష్మికి 425 చదరపు గజాల స్థలాన్ని రూ.350 చొప్పున క్రమబద్ధీకరిస్తూ జీవో జారీచేసిందని, ఆ సమయంలో మారెట్ విలువ చదరపు గజానికి 60,300 గా ఉన్నదని తెలిపారు. గత విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 9 నెలలు గడిచిన తర్వాత మరో 4 వారాల గడువు కోరడం సరికాదని పేరొన్నది. అన్ని వివరాలతో సెప్టెంబర్ 3లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

