తాండూర్, డిసెంబర్ 5 : మంచిర్యాల జిల్లా తాండూర్లో అయ్యప్ప మాల ధరించిన ఓ భక్తుడు శుక్రవారం శబరిమలకు సైకిల్ యాత్ర చేపట్టారు. తాండూర్ మండలం తంగళ్లపల్లి గ్రామానికి చెందిన బాణాల వంశీకృష్ణ అనే అయ్యప్ప భక్తుడు మాలధారణ ధరించారు. శబరిమలకు సైకిళ్ పై వెళ్లాలని ఈ భక్తుడు నిర్ణయించుకున్నాడు. మండల కేంద్రం ఐబీలో ఆంజనేయస్వామి ఆలయం ప్రాంగణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వీరి యాత్ర విజయవంతంకావాలని తోటి స్వాములతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణు ఘోషతో సైకిల్ యాత్రతో శబరిమలకు బయలుదేరుతున్న వంశీకృష్ణ స్వామిని కుటుంబ సభ్యులతో పాటు అయ్యప్ప స్వాములు కొంతదూరం వారితో యాత్రలో పాల్గొని సాగనంపారు. ఈనెల శురిమలలో నిర్వహించే పడిపూజ కార్యక్రమానికి అందేలా సైకిల్ యాత్రతో అక్కడికి చేరుకుంటారని స్వాములు తెలిపారు.