దండేపల్లి, మార్చి21 : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని ధర్మరావుపేట మోడల్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను జీసీసీ చైర్మన్ కొట్నాక తిరుపతి శుక్రవారం ముగ్గుపోసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తుందని తెలిపారు. లబ్ధిదారులు పనులు ప్రారంభించుకుని తొందరగా పూర్తి చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తాసీల్దార్ సంధ్యారాణీ, ఎంపీడీఓ జాగర్లమూడి ప్రసాద్, లక్సెట్టిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్‌చంద్, మాజీ ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి, మాజీ ఎంపీటీసీలు ముత్యాల శ్రీనివాస్, తోట మోహన్, బొడ్డు కమలాకర్, నాయకులు కంది సతీశ్‌కుమార్, గడ్డం రాంచందర్, జాబు కాంతారావు, అనవేని తిరుపతి పాల్గొన్నారు.