తాండూర్, డిసెంబర్ 3 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడాన్ని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రం ఐబిలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ముఖ్యమంత్రి బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెజారిటీ ప్రజలైన హిందూ ప్రజల ఆరాధ్య దేవతలైనటువంటి దేవీ దేవతలను అవమానించడం ఒక మతపు ప్రజల మన్నలను పొందడం కోసమేనని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని అన్నారు.
అనంతరం మండలంలోని జిన్నింగ్ మిల్లులను సందర్శించి పత్తి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతుల సమస్యలను వ్యవసాయ అధికారులు పరిగణలోకి తీసుకొని వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దూడపాక భరత్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యాల ఏమాజీ, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు,రాష్ట్ర సీనియర్ నాయకులు చిలువేరు శేషగిరి, పులగం తిరుపతి, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రావణ్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏముర్ల ప్రదీప్, ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు నర్సింగ్, మండల ఉపాధ్యక్షుడు కొండ రవి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి అడ్వాల సతీష్, తదితరులు పాల్గొన్నారు.