Indiramma houses | భీమారం, జూన్ 25 : ఉన్నోనికే ఇందిరమ్మ ఇల్లు అని, ఒక్క ఇంట్లో ఇద్దరికి, ముగ్గురికి ఇందిరమ్మఇండ్లు ప్రొసీడింగ్స్ వచ్చాయని, మాలాంటి పేదల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు మాజీ సర్పంచులు కొంతమంది పంచాయతీ కార్యదర్శులు డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ప్రొసీడింగ్స్ వచ్చేలా చేశారని, భీమారం మండల కేంద్రంతోపాటు కాజిపల్లి, ఆరెపల్లి ఎల్కేశ్వరం గ్రామానికి చెందిన పలువురు ప్రజలు మంత్రి వివేక్ కార్యక్రమంలోనే ఆందోళన చేశారు.
బుధవారం మండల కేంద్రంలోని స్థానిక కస్తూర్బాగాంధీ పాఠశాలలో రూ.66 లక్షలతో అదనపు డార్మెంటరీ గదుల నిర్మాణానికి కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపన చేసి అనంతరం స్థానిక రైతు వేదికలో ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ అందజేస్తుండగా.. ఆడపెల్లి గ్రామానికి చెందిన ప్రజలు ఆందోళన చేశారు. ఉన్నోనికే పైసలు తీసుకొని ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా చేశారనీ, ఆందోళన చేయగా అక్కడ ఉన్న పోలీసులు వారిని రైతు వేదిక నుండి బయటకు తీసుకువెళ్లారు. వారు బయట ఆందోళన చేశారు. మంత్రి కార్యక్రమంలోనే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం అరెపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి దేవేందర్ సర్పంచ్ లేకుండా ప్రొసీడింగ్స్ ఇవ్వడం కుదరదని.. అనగా అక్కడ ప్రజలు ఆయనను నిలదీశారు. మాకు వచ్చిన ప్రొసీడింగ్స్‌లకు సర్పంచ్ పర్మిషన్ ఏంటి అని ప్రశ్నించారు. దీంతో కార్యాలయ సిబ్బంది ప్రొసీడింగ్స్‌లను అందజేశారు. భీమారం ఇంచార్జ్ కార్యదర్శి రవిని సైతం స్థానిక భీమారం ప్రజలు నిలదీశారు. ప్రొసీడింగ్స్‌లను రేపు ఇస్తాం అనటంతో భీమారం గ్రామానికి చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు ఎలా ఇస్తారని.. ఇప్పుడే ఇక్కడ ఇవ్వాలని నిలదీశారు.
కాజిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బండి శేఖర్‌తోపాటు మరో కాంగ్రెస్ నాయకులు షెడం శెట్టి రమేష్‌ను సైతం భీమారం ఎంపీడీవో కార్యాలయంలో నిలదీశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కొత్తపల్లి మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చేకూర్తి సత్యారాయణ రెడ్డి, పొడేటి రవి, దర్శనల రమేష్, దుర్గo రాజు, జర్పూల రాజ్ కుమార్ నాయక్, ఉష్కమల్ల శ్రీనివాస్, ఉష్కమల్ల పూన్నం చందు తదితరులు పాల్గొన్నారు.
High Court | మూడు నెలల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి : తెలంగాణ హైకోర్టు ఆదేశం
Gupta Nidhulu | గుప్తనిధుల కోసం ఆంజనేయ స్వామి ఆలయంలో తవ్వకాలు
cricket tournament | యువత క్రీడల్లో రాణించాలి.. క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన చల్మెడ