మంచిర్యాల అర్బన్, ఆగస్టు 19 : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) డైరెక్టర్గా పాత మంచిర్యాల చెందిన ఆరె దేవేందర్ నియమితులయ్యారు. తెలంగాణ ప్రభుత్వం బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పీఏసీఎస్ పాలకవర్గానికి సంబంధించిన సభ్యుల జాబితాలో ఆరె దేవేందర్ పేరు చోటుచేసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున సంబంధిత సహకార శాఖ అధికారులు తదుపరి చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీఏసీఎస్ డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు ఆరె దేవేందర్ కృతజ్ఞతలు తెలిపారు. సహకార సంఘం అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Car accident | సిద్దిపేట జిల్లాలో విషాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు నలుగురు మృతి
Thieves | గద్వాల పట్టణంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. బంగారం, నగదు అపహరణ