Car accident | సిద్దిపేట(Siddipet) జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి(Well) దూసుకెళ్లిన ప్రమాదంలో( Car accident) ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈవిషాదకర సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో అర్ధరాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. దుబ్బాక మండలంలోని బలవంతాపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30), అతని భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)తో కలిసి సిద్దిపేట నుంచి తమ స్వగ్రామానికి కారులో వస్తుండగా బుధవారం అర్ధరాత్రి సమయంలో అదుపుతప్పి బావిలో పడిపోయారు.
స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది జేసీబీ సహాయంతో బావిలో నుంచి కారును, నలుగురి మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం దుబ్బాక ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడంతో బలవంతాపూర్, అప్పనపల్లి గ్రామాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.