జోగులాంబ గద్వాల : గద్వాల్ పట్టణంలోని 2వ వార్డులో పట్టపగలే ఓ టీచర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి దాదాపు నాలుగు తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరించినట్లు బాధితులు చెబుతున్నారు..ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్,పట్టణ ఎస్ఐ కల్యాణ్ కుమార్ ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పట్టణంలో వరుస చోరీల నేపథ్యంలో పోలీసులు గస్తీ పెంచాలని స్థానికులు కోరుతున్నారు.
చోరీకి గురైన బంగారం,నగదు ఎంత?
బాధితులు ఇద్దరు (భార్యాభర్తలు) టీచర్లు కావడంతో బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి వెళ్లి సాయత్రం తిరిగి వచ్చి చూసేసరికి తాళం విరిగి ఉండటంతో దొంగతనం జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, మొదట 5తులాలు బంగారం, రూ.2,50,000నగదు పోయిందని అన్నప్పటికి తర్వాత 4తులాలు బంగారం, రూ. 25వేలు మత్రమే చోరీకి గురైనట్లు తెలిసింది. ఈ విషయంపై పట్టణ ఎస్ఐ కల్యాణ్ కుమార్ ని వివరణ కోరగా ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని విచారణ అనంతరం చోరీకి గురైన బంగారం, నగదు మొత్తం వాటి వివరాలు వెళ్లడిస్తామని ఎస్ఐ కల్యాణ్ కుమార్ తెలిపారు.