మహబూబ్ నగర్ : సంక్షేమానికి కొత్త నిర్వచనం కేసీఆర్ ( KCR ) పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) అన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకున్నా ప్రజల అవసరాలను గుర్తించి పథకాలను అమలు చేయడంలో కేసీఆర్ను మించిన పాలన లేదని కొనియాడారు.
కేసీఆర్ పాలన, పథకాలు దేశానికి తలమానికంగా, రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. మానవీయ పథకాల అమలుతో పేదలకు అండగా నిలిచిన పాలకుడు కేసీఆర్ అని వెల్లడించారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబంధు వంటి పథకాలు పార్టీలకు అతీతంగా అమలుచేసిన నాయకుడని ప్రశంసించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి సంక్షేమం అంటే పట్టదు. దాని నిర్వచనం ఏమిటో తెలియదు. కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కల్యాణలక్ష్మిని ప్రశ్నార్థకం చేసిందని ఆరోపించారు.