e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home ఆదిలాబాద్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌

బజార్‌హత్నూర్‌, సెప్టెంబర్‌ 18: టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ పిలుపునిచ్చారు. బజార్‌హత్నూర్‌ మండలంలో ఎన్నికైన గ్రామ కమిటీల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు శనివారం ఆదిలాబాద్‌లో ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికైన సభ్యులను శాలువాతో సన్మానించారు. మండల కన్వీనర్‌గా కానిందే రాజారాం రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో బజార్‌హత్నూర్‌ మండల కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అంతకుముందు మండల కన్వీనర్‌ రాజారాంకు నియామక పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు బొడ్డు శ్రీనివాస్‌, రమణ, గుంజాల భాస్కర్‌రెడ్డి, జాంసింగ్‌, ప్రకాశ్‌, ఉత్తమ్‌, విజేందర్‌, మధుకర్‌, నరేశ్‌, విద్యాసాగర్‌, శశికళ, వినోద్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

- Advertisement -

టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌గా రుక్మాణ్‌సింగ్‌

బోథ్‌, సెప్టెంబర్‌ 18: బోథ్‌ టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌గా ఎస్‌ రుక్మాణ్‌సింగ్‌ను నియమించినట్లు ఎమ్మెల్యే బాపురావ్‌ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఎలుక రాజును నియమించినట్లు పేర్కొన్నారు. కన్వీనర్‌గా మరోసారి అవకాశం ఇచ్చినందుకు రుక్మాణ్‌సింగ్‌ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు తాహెర్‌ బిన్‌ సలాం, నాయకులు జగన్‌మోహన్‌రెడ్డి, కొండయ్య, జగదీశ్‌, సర్పంచ్‌ సురేందర్‌యాదవ్‌ ఉన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన గ్రామ కమిటీ అధ్యక్షులు

ఇచ్చోడ, సెప్టెంబర్‌ 18: టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికైన గ్రామ కమిటీ అధ్యక్షులు, ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ఆదిలాబాద్‌లో బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. మండల కన్వీనర్‌ ఏనుగు కృష్ణారెడ్డి మండలంలో ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యుల వివరాల జాబితాను ఎమ్మెల్యేకు అందజేశారు. ఇచ్చోడ పట్టణ కమిటీ ఎన్నిక మినహా 31 గ్రామాల కమిటీల నియామకం పూర్తయిందని పేర్కొన్నారు. మూడు రోజుల్లో ఇచ్చోడ పట్టణ కమిటీ ఎన్నిక నియమిస్తామని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఇచ్చోడ డివిజన్‌ ఆత్మ చైర్మన్‌ నరాల రవీందర్‌, మాజీ ఎంపీపీ సుభాష్‌ పాటిల్‌, నాయకులు ముస్తాఫా, భాస్కర్‌, వెంకటేశ్‌, రాథోడ్‌ ప్రకాశ్‌, అజీమ్‌, గణేశ్‌, రాథోడ్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.

పేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్‌

ఇచ్చోడ, సెప్టెంబర్‌ 18: పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరంలాంటిదని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ అన్నారు. మండంలోని కేశవపట్నంలో ఒకరు, ఇచ్చోడలో ఇద్దరు, జల్థాలో ఇద్దరు, జున్ని గ్రామానికి చెందిన ఒకరికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

విద్యార్థులపై జాగ్రత్తలు తీసుకోవాలి

బజార్‌హత్నూర్‌,సెప్టెంబర్‌ 18 : విద్యార్థులపై జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావ్‌ ఉపాధ్యాయులకు సూచించారు. పిప్రి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలలోని పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం తరగతి గదులను పరిశీలించారు. ఆయన వెంట టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ రాజారాం, బోథ్‌ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుంజల భాస్కర్‌రెడ్డి, డైరెక్టర్‌ పులి శంకర్‌గౌడ్‌, మండల ప్రధాన కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్‌, విద్యార్థి నాయకుడు సాకేశ్‌కుమార్‌, రాఘవన్‌రెడ్డి, ఆరెల్లి ఆనంద్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement