కుమ్రంభీం ఆసిఫాబాద్ : రైతుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుత్ను సీఎం కేసీఆర్ రైతు బంధువుడని జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన సందర్భంగా గురువారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ కోవలక్ష్మి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ పాలనలో రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చి అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని ఆమె గుర్తు చేశారు. రైతును రాజును చేసిన ఘనత సీఎం కేసీఆర్ దక్కుతుందన్నారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు నీళ్లు, కరెంట్ లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అలాంటి కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి రానీయొద్దన్నారు. మూడు పంటలకు సరిపడా నీళ్లు, కరెంట్ ఇస్తున్నబీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగేల నాగేశ్వరరావు, టౌన్ ప్రెసిడెంట్ హైమత్ ,సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.