Labourers | జైనూర్, సెప్టెంబర్ 18 : ఈ నెల 21న అసిఫాబాద్ జిల్లాలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అశోక్ గురువారం పిలుపునిచ్చారు. జీవో నెంబర్ 12ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే సహజ, ప్రమాద, మరణం, పాక్షిక, పూర్తిస్థాయి, అంగవైకల్యంకు ఇచ్చే సంక్షేమ నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విలేకరుల సమావేశంలో అశోక్ మాట్లాడుతూ.. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు బదిలీ చేసిన 346 కోట్ల రూపాయలను వెంటనే వాపస్ తీసుకోవాలని..
వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీని వెంటనే అనుభవజ్ఞులైన ట్రేడ్ యూనియన్ నాయకులతో నియమించాలన్నారు. ప్రభుత్వంలోని, అధికారులు, వెల్ఫేర్ బోర్డు నిధులను తమ ఇష్టానుసారం బదిలీ చేయడం ఖర్చు పెట్టడం చట్ట విరుద్ధమన్నారు. 55 సంవత్సరాలు నిండిన కార్మికులకు కనీసం 9000 పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఆఫీసులలో జరిగే అవినీతిని అరికట్టాలి..
పెళ్లి కానుక ప్రసూతి కానుక 30 వేల నుండి లక్ష రూపాయలకు పెంచాలని, సహజ మరణానికి ఇస్తున్న రూ.1,30,000ను 5 లక్షలకు పెంచాలని వెల్ఫేర్ బోర్డు కార్డు ఉండి అర్హత కలిగిన కార్మికుల సొంత ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం బోర్డు ద్వారా ఇవ్వాలని, కార్మికుల పిల్లల చదువులకు స్కాలర్షిప్లు బోర్డు ద్వారా అందించాలన్నారు. కార్మికులు పనిచేసే పనిముట్లకు కనీసం పదివేల రూపాయలు తగ్గకుండా ఆర్థిక సహాయం అందించి, బోర్డులో నమోదై రెన్యువల్ కానీ 12 లక్షల 15 వేల కార్డులను వెంటనే రెన్యువల్ చేసి ఏఎల్ఓఏసీఎల్ డీసీఎల్ బోర్డు సెక్రటరీ ఆఫీసులలో జరిగే అవినీతిని అరికట్టాలి. బ్రోకర్లు అవినీతి అధికారులను శిక్షించాలని పేర్కొన్నారు.
1998 సెస్ చట్టం ద్వారా వసూలు చేసిన సంక్షేమ నిధులను కార్మికులకే ఖర్చు పెట్టాలి. వలస కార్మికుల చట్టం 1979, భవన ఇతర నిర్మాణ కార్మికుల చట్టం 1996, సంక్షేమ నిధి సెస్ చట్టం 1998లను పునరుద్ధరించి పకడ్బందీగా అమలు చేయాలని, ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 4 కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని.. పట్టణాల్లోని అడ్డా ప్రాంతాల్లో షెడ్లు, మరుగుదొడ్లు, మంచినీరు, 5 రూపాయల భోజనం, కల్పించాలని డిమాండ్ చేశారు.
ప్రకృతి పరంగా దొరికే ఇసుకను ఉచితంగా వాడుకునేలా అనుమతించాలని తదితర డిమాండ్లతో ఈ నెల 21న జరగబోయే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి ఆనందరావు రామచందర్ వెంకన్న మహేష్ ,సదయ్య బాలాజీ ,పవర్ ప్రకాష్, దుర్గాయ శివానంద్, షేక్ అజీమ్, సింగరావు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
Drugs | మాసాయిపేటలో 4 కిలోల డ్రగ్స్ పట్టివేత..
Promotions | రాష్ట్రంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు
Traffic Jam | హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్