Pranahita | కౌటాల: ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మడిహట్టి వద్ద గల ప్రాణహిత నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. బుధవారం ఉదయం వరద నీరు పుష్కర ఘాట్‌ను తాకుతూ ప్రవహించింది.
ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇంతలా ప్రాణహితలో భారీగా వరద నీరు రావడం ఇదే తొలిసారి. కౌటాల మండలంలో ఇప్పటివరకు ఎక్కడ కుంటలు, చెరువులు నిండిన దాఖలాలు లేవు. దీంతో నది ప్రవాహాన్ని చూసేందుకు మండలవా సులు ప్రాణహిత పుష్కర ఘాట్ వద్దకు తరలివస్తున్నారు.